రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలందరికీ సువర్ణ పాలన అందిస్తామని అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అన్నారు. చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం,గంగినేపల్లి, కనుముక్కల గ్రామాల్లో అధికారులు, నాయకులతో కలిసి సచివాలయ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. రాజధాని అనేది కేంద్రానికి సంబంధించిన విషయం కాదని, రాష్ట్రానికి సంబంధించిన విషయమని ఎమ్మెల్యే అన్నారు. ప్రతీ ఒక్కరు బాధ్యతతో వ్యవహరించినప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలో ఉన్న చెరువులకు హంద్రీనీవా కాలువ ద్వారా నీటిని అందిస్తామని తెలిపారు.
'జగన్ ఆధ్వర్యంలో సువర్ణ పాలన' - రాప్తాడులో స్థానిక ఎమ్మెల్యే పర్యటన
ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలందరికీ సువర్ణపాలన అందిస్తామని రాప్తాడు నియోజకవర్గ శాసనసభ్యుడు ప్రకాశ్‌రెడ్డి అన్నారు. చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం,గంగినేపల్లి, కనుముక్కల గ్రామాల్లో అధికారులు, నాయకులతో కలిసి ఆయన పర్యటించారు.
రాప్తాడులో స్థానిక ఎమ్మెల్యే పర్యటన