చేనేతల కులదైవం శ్రీ చౌడేశ్వరీ దేవి పంచమ జ్యోతుల ఉత్సవం కన్నులపండువగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పాల్గొని, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కేశవ్‌ను ఆలయ సిబ్బంది సన్మానించారు.
చౌడేశ్వరీ దేవి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ - Secretary of State for tdp news
అనంతపురం జిల్లా ఉరవకొండలోని చౌడేశ్వరీ దేవి అమ్మవారికి తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరినట్లు ఆయన తెలిపారు.
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
పట్టణంలోని పలు చౌడేశ్వరీ అమ్మవారి ఆలయాలను ఎమ్మెల్యే దర్శించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులు, యువతీ యువకులు కేశవ్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరినట్లు ఆయన తెలిపారు.