అనంతపురం జిల్లా ఉరవకొండలో గుర్తుతెలియని వ్యక్తులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ తెదేపా కార్యకర్త ప్యారం కేశవనందను ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పరామర్శించారు. ఈ మేరకు కేశవనంద ఇంటికి వెళ్లి కలిశారు. దాడికి పాల్పడ్డ వాళ్లను కఠినంగా శిక్షించాలని పయ్యావుల డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరారు. దాడులకు భయపడి కార్యకర్తలు అధైర్య పడొద్దని.. ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆయనతోపాటు పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
దాడికి గురైన తెదేపా కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే పయ్యావుల - Anantapur latest news
ఉరవకొండలో గుర్తుతెలియని వ్యక్తులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ తెదేపా కార్యకర్త ప్యారం కేశవనందను ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పరామర్శించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కేశవ్ డిమాండ్ చేశారు.
దాడికి గురైన తెదేపా కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే కేశవ