కరోనా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దని, అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సూచించారు. అనుమానితులు ఎవరినీ ఉపేక్షించకూడదని, అవసరమైతే క్వారంటైన్ కి పంపాలని అధికారులను ఆదేశించారు.
కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దు: పద్మావతి - Jonnalagadda padmavathi latest news
పుట్లూరు మండలం అరకటివేమల కంటైన్మెంట్ జోన్ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.
![కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దు: పద్మావతి Mla padmavathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:28-ap-atp-69-04-kantainmentjone-parisilina-av-ap10096-04062020190245-0406f-1591277565-276.jpg)
Jonnalagadda padmavathi
కంటైన్ మెంట్ జోన్ లో ఉన్న వారికి నిత్యావసర సరకులు, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రశాంతంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్ లు వాడాలని విజ్ఞప్తి చేశారు. భౌతిక దూరాన్ని పాటించాలని ప్రజలకు సూచించారు.
ప్రతి ఒక్కరూ హోమియోపతి మాత్రలను మూడు రోజుల పాటు వేసుకోవాలని, వాటిని కూడా నేరుగా ప్రజల ఇంటికే చేరుస్తామని చెప్పారు. అందరూ ధైర్యంగా ఉండి అధికారులకు, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.