ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులను ఆదుకోకపోతే ఆందోళనలే..: ఎమ్మెల్యే బాలయ్య - mla balakrishna visited singavaram village news update

రాష్ట్ర ప్రభుత్వ చెవిటి, మూగలాగా మారి పాలన కొనసాగిస్తోందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. నియోజకవర్గంలో రెండో రోజు ఆయన లేపాక్షి మండలం సింగవరం గ్రామంలో పర్యటించారు. వైకాపా తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA nandamuri Balakrishna tour in Singavaram
సింగవరం పర్యటనలో పంటలు పరిశీలించిన ఎమ్మెల్యే బాలయ్య

By

Published : Jan 7, 2021, 6:50 PM IST

వైకాపా ప్రభుత్వం అవినీతి పాలన కొనసాగిస్తోందని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. లేపాక్షి మండలం సింగవరం గ్రామంలో రెండో రోడు ఆయన వర్షానికి తడిసి రంగు మారిన మొక్కజొన్న, ధాన్యాన్ని పరిశీలించి, రైతులు పరామర్శించారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు.. బాలయ్యతో మొరపెట్టుకున్నారు. ఈ క్రాప్​ బుకింగ్​లో అవినీతి తారస్థాయిలో జరిగిందని.. దళారులు, అధికారులు, ప్రభుత్వ పెద్దలు సిండికేట్​గా ఏర్పడి రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఒక్క పాసుబుక్కు వెలుగులోకి వస్తే వారి అవినీతి భాగోతం బయటపడుతుందన్నారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోకపోతే ఢిల్లీ తరహాలో తెదేపా ఆధ్వర్యంలో రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

సింగవరం పర్యటనలో పంటలు పరిశీలించిన ఎమ్మెల్యే బాలయ్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details