హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా తెదేపా నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం పట్టణానికి చెందిన పలువురు యువత బాలకృష్ణ సమక్షంలో పార్టీలో చేరారు . యువకులకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు బాలకృష్ణ. పార్టీ గెలుపు కోసం అందరూ కృషి చేయాలని తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావటం శుభపరిణామమని ఆయన అన్నారు.
పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమావేశం - పార్టీ నేతలతో సమావేశమైన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
అనంతపురం జిల్లా హిందూపురం పర్యటనలో భాగంగా.. తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల్లో తెదేపా మద్దతుదారులు గెలుపొందేలా కృషి చేయాలని పార్టీ నేతలకు తెలిపారు.
హిందూపురంలో పార్టీ కర్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ