పురపాలక ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని చౌడేశ్వరి కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సతీసమేతంగా ఓటు వేశారు. పోలింగ్ బూత్ నెంబర్ 2/1 వద్ద ఎమ్మెల్యే దంపతులు క్యూలైన్లో వేచి ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద బాలకృష్ణతో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు - MLA Nandamuri Balakrishna latest news
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్లో వేచి ఉండి మరీ... ఎమ్మెల్యే దంపతులు ఓటు వేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు