'ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు' కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఎం.తిప్పేస్వామి పాదయాత్ర చేపట్టారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండల కేంద్రం నుంచి మోపురుగుండు గ్రామం వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. గతంలో వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకొన్నారని... నేడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 17 నెలలోనే 90 శాతం ఇచ్చిన హామీలు అమలుపరిచారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఎమ్మెల్యేలు పాదయాత్ర ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి తెలుపుతున్నాం అని అన్నారు. వీటితోపాటు మడకశిర నియోజకవర్గంలోని అన్ని చెరువులకు త్వరలో కృష్ణా జలాలు నింపేందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అనంతపురం ఎమ్మెల్యే తిప్పేస్వామి పాదయాత్ర - అనంతపురం తాజా వార్తలు
సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే ఎం.తిప్పేస్వామి పాదయాత్ర చేశారు. మడకశిర నియోజకవర్గంలోని అన్ని చెరువులకు త్వరలో కృష్ణా జలాలు నింపేందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అనంతపురం ఎమ్మెల్యే ఎం.తిప్పేస్వామి పాదయాత్ర