ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బీసీలకు సముచిత స్థానం కల్పించింది వైకాపానే' - ధర్మవరంలో చేనేత ఆధ్వర్యంలో ర్యాలీ

బీసీలకు సముచిత స్థానం కల్పించింది వైకాపా ప్రభుత్వమేనని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తొగట వీర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గడ్డం సునీత అన్నారు. తొగట వీర క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేయటంపై హర్షం వ్యక్తం చేస్తూ ధర్మవరంలో ర్యాలీ నిర్వహించారు.

MLA Kethireddy Venkatramireddy
ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ర్యాలీ

By

Published : Oct 21, 2020, 3:24 PM IST

రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం కల్పించింది వైకాపా ప్రభుత్వమేనని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తొగట వీర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గడ్డం సునీత అన్నారు. ధర్మవరానికి తొగట వీర క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేయటంపై పట్టణంలో చేనేత ఆధ్వర్యంలో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు.

శివనగర్ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ప్రధాన రహదారుల మీదుగా పి ఆర్ టి కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మాజీ సీఎం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు.

ABOUT THE AUTHOR

...view details