ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీఆర్​ఏలకు నూతన వస్త్రాల బహూకరణ - అనంతపురం జిల్లా వార్తలు

అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వీఆర్​ఏలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. కరోనా నియంత్రణలో వారు చేసిన కృషికి ప్రతిఫలంగా వస్త్రాలు అందించినట్లు తెలిపారు.

kapu ramachandra reddy
వీఆర్​ఏలకు నూతన వస్త్రాలు బహూకరించిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

By

Published : Oct 24, 2020, 11:49 AM IST

అనంతపురం జిల్లా రాయదుర్గంలో స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి గ్రామ రెవెన్యూ సహాయకులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల పరిధిలోని రెవెన్యూ సహాయకులకు దసరా పండుగ సందర్భంగా నూతన వస్త్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని అంతమొందించడంలో వీఆర్​ఏలు పోషించిన పాత్ర ప్రశంసనీయం అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పోలీసు, అంగన్వాడీ, మీడియా, పారిశుద్ధ్య సిబ్బంది కొవిడ్​పై పోరాడారని కొనియాడారు. వారి కృషి వల్లే రాష్ట్రం కరోనా నియంత్రణలో ముందు వరుసలో ఉందన్నారు. వీఆర్​ఏల సేవలకు ప్రతిఫలంగా వారికి నూతన వస్త్రాలు బహూకరించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details