White color to Temple: కులమతాలకు అతీతంగా ఉన్న అనంతపురం జిల్లాలోని గూగూడు కుళ్లాయిస్వామి క్షేత్రానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి రంగులను మార్పించారు. ఆలయానికి ఉన్న రంగులను మార్చి.. తెలుపు, బంగారం రంగులు వేయించారు. ఈ రంగులపై స్థానిక ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఉండే రంగులే వేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
గూగూడు కుళ్లాయిస్వామి గుడికి కొత్త రంగులు.. భక్తుల ఆగ్రహం - అనంతపురం జిల్లా తాజా వార్తలు
GUGUDU KULLAYI SWAMY TEMPLE: సామరస్యానికి ప్రతీకగా నిలిచే గూగూడు కుళ్లాయిస్వామి క్షేత్రానికి రంగులు మార్చడం చర్చనీయాంశమైంది. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి రంగులను మార్పించారు. ఇప్పటివరకూ అన్ని కులమతాల ఐక్యతకు గుర్తుగా రంగులు ఉండేవని,.. ఇప్పుడు తెల్లరంగులు వేయడం పట్ల ఎమ్మెల్యే తీరును భక్తులు తప్పు పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు విమర్శలు సైతం గుప్పిస్తున్నారు.
GUGUDU KULLAYI SWAMY TEMPLE
MLA Jonnalagadda Padmavathi: కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలకోసం దేవదాయశాఖ వారు రూ.2.50 లక్షలు వెచ్చించి ఆలయానికి రంగులు వేయించారు. ఆ తరువాత రెండు రోజులకే ఎమ్మెల్యే తెల్ల రంగులను వేయించారు. ఎమ్మెల్యే తమకు సమాచారం ఇచ్చి రంగులను మార్పించారని, తన సొంత నిధులతో రంగులు వేయించారని ఆలయ ఈవో శోభ తెలిపారు.
ఇవీ చదవండి: