MLA Balakrishna on New Districts: హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాని ప్రకటించాలని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయం చేయొద్దని హితవు పలికారు. వైకాపా ఇచ్చిన హామీ మేరకు ప్రతి లోక్‌సభ కేంద్రం ఒక జిల్లా కావాలని బాలకృష్ణ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈమేరకు వీడియో సందేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Balakrishna: హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లా ప్రకటించాలి: బాలకృష్ణ - సత్యసాయి జిల్లా ప్రకటించాలని బాలకృష్ణ డిమాండ్
MLA Balakrishna on New Districts: జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయం చేయొద్దని ఏపీ ప్రభుత్వాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరారు. హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాని ప్రకటించాలని బాలయ్య డిమాండ్ చేశారు.
MLA Balakrishna
'అన్ని రంగాల్లో హిందూపురం అభివృద్ధి చెందిందని.. జిల్లా కేంద్రానికి అవసరమయ్యే సదుపాయాలు అక్కడ పుష్కలంగా ఉన్నాయి. పరిసర ప్రాంతాల వాసులు హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పడుతుందని ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయం చేయొద్దు. వెంటనే హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాని ప్రకటించాలి' అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాలయ్య డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి..
Last Updated : Jan 27, 2022, 4:53 PM IST