అనంతపురం జిల్లా హిందూపురం గ్రామీణ మండలం కిరికెర పంచాయతీ మూడో వార్డు అభ్యర్థిగా నాగరాజు నామినేషన్ దాఖలు చేశారు. అతన్ని నామినేషన్ ఉపసంహరించుకోవాలని వైకాపా నాయకులు ఒత్తిళ్లకు గురి చేయగా.. అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకోనున్నట్టు భార్యతో తెలిపాడు. అవమాన భారాన్ని తట్టుకోలేక భార్య సుజాత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలిని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరామర్శించి ధైర్యాన్ని నింపారు. తెలుగుదేశం పార్టీ అండ ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఒత్తిళ్లకు తలొగ్గిన భర్త.. భార్య ఆత్మహత్యాయత్నం - mla balakrishna updates
పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన ఓ అభ్యర్థిని వైకాపా నేతలు బెదిరించారు. ఆందోళనతో... నామపత్రాల ఉపసంహరణకు అతను సిద్ధం కాగా... అతని భార్య ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో కలకలం సృష్టించింది. బాధితురాలిని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు.
ఒత్తిళ్లకు తలొగ్గిన భర్త... భార్య ఆత్మహత్యాయత్నం
"రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. వైకాపా ఇప్పటికైనా బెదిరింపు ధోరణి మానుకోకపోతే సరైన రీతిలో బుద్ధి చెబుతాం. తెదేపా మద్దతుదారులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండండి" -నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యే
ఇదీ చదవండి