ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పారిశుద్ధ్యంలో లోపాలు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవు' - ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

పారిశుద్ధ్యం విషయంలో లోపాలు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి శానిటేషన్ సెక్రటరీలను హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరిపై అయినా చర్యలు తీసుకునేందుకు వెనకాడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

mla anantha venkata ramireddy warning to sanitory inspectors in ananthapuram
అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే

By

Published : Aug 24, 2020, 6:47 PM IST

పారిశుద్ధ్యం విషయంలో లోపాలు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి శానిటేషన్ సెక్రటరీలను హెచ్చరించారు. నగరంలో పారిశుద్ధ్య పనులకు సంబంధించి కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మూర్తి, నగరంలోని సచివాలయాల్లో పని చేస్తున్న శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు.

జిల్లాలో చిన్న పట్టణాలు మెరుగైన పారిశుద్ధ్యంతో ర్యాంకులు సాధిస్తే.. ఇంత మంది సిబ్బంది ఉన్నా అనంతపురం ఎందుకు వెనుకబడిందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గతంలో ఆరుగురు శానిటరీ ఇన్స్​పెక్టర్లు ఉన్నచోట ఇప్పుడు 70 మందికి పైగా సిబ్బంది ఉన్నారని గుర్తుచేశారు. అయినప్పటికీ పారిశుద్ధ్యంలో లోపాలు ఉంటున్నాయంటే ఎవరిది తప్పు అని..? నిలదీశారు. ఇకపై ఇలాంటివి ఉండకూడదని.. ఈ విషయంలో ఎవరిపై అయినా చర్యలు తీసుకునేందుకు వెనకాడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details