అనంతపురం జిల్లా మడకశిర మండల వ్యాప్తంగా 25,800 కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించారు. ప్రభుత్వం పేదలకు అందించే బియ్యం కార్డుల్లో తప్పులు ఉంటున్నాయి. వీటిలో కుటుంబ పెద్ద ఫోటో ఉండాల్సిన చోట చిన్నారుల ఫోటోలు వచ్చాయి. కొన్నింటిలో అసలు ఫోటోలే ఉండటం లేదు… మరికొన్నింటిలో పేర్లు తప్పులు తడకగా రావటంతో బియ్యం కార్డు దారులు బాధపడుతున్నారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పులున్న కార్డులను త్వరగా సరి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
తప్పుల తడకగా రేషన్ కార్డులు.. ఇబ్బందుల్లో లబ్ధిదారులు - mistakes in rations cards- beneficiaries facing problems
అనంతపురం జిల్లా మడకశిర మండల వ్యాప్తంగా 25వేల 800 కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం అందించింది. చాలా వరకు బియ్యం కార్డుల్లో పేర్లు, ఫొటోలు, వివరాలు తప్పుల తడకగా ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు.

తప్పుల తడకగా బియ్యం కార్డులు-ఇబ్బందుల్లో లబ్ధిదారులు
ఇవీ చదవండి: పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ దొంగతనం!