ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెచ్చులూడిన పైకప్పు..  త్రుటిలో తప్పిన ప్రమాదం - పాతూరు తపాల కార్యాలయంలో పెచ్చులూడిన పై కప్పు

అనంతపురం నగరంలోని పాతూరు తపాల కార్యాలయంలో పైకప్పు నుంచి పెచ్చులూడి కింద పడ్డాయి. త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఒక ఉద్యోగికి స్వల్ప గాయాలయ్యాయి.

Missed risk of cracked roof fault
పెచ్చులూడిన పైకప్పు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

By

Published : Feb 26, 2021, 12:56 PM IST

అనంతపురం నగరం పాతూరు గుత్తిరోడ్డులోని తపాల కార్యాలయం భవనం పై కప్పు పెచ్చులూడి పడింది. ఉద్యోగులు సాయంత్రం ఇళ్లకు వెళ్లడానికి సమాయత్తం అవుతున్న సమయంలో ఆకస్మాత్తుగా పై కప్పు పెచ్చులూడి కిందపడ్డాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగి నారాయణ తలపై పెచ్చులు పడ్డాయి. పోస్టాఫీసు భవనం పాతది కావటంతో ఈ ప్రమాదం జరిగింది. కొత్త భవనం నిర్మించాలని మూడేళ్లుగా ప్రతిపాదనలు పంపించిన.. కొత్త భవనం మాత్రం నిర్మాణానికి నోచుకోలేదు. ఇక్కడ విధులు నిర్వహించేందుకు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details