ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

girl kidnap: బాలిక కిడ్నాప్.. 150 కిలో మీటర్లు ఛేదించి.. - కదరి వార్తలు

కదిరిలో బాలిక కిడ్నాప్ వ్వవహారం కలకలం రేపింది. గురువారం రాత్రి ముగ్గురు యువకులు ఓ బాలికను ఇంటినుంచి అపరించుకుపోయారు. ఆ సమయంలో తల్లిదండ్రులను ఇంట్లో ఉంచి.. తలుపులు వేశారు. బాధితుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు మూడు గంటల్లోనే కిడ్నాప్​ను ఛేదించారు.

minor girl kidnap reveled in kadiri
minor girl kidnap reveled in kadiri

By

Published : Aug 20, 2021, 11:43 AM IST

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో బాలిక అపహరణ వ్యవహారం కలకలం రేపింది. గురువారం రాత్రి పొద్దుపోయాక ముగ్గురు యువకులు బాలికను ఇంటి నుంచి అపహరించుకెళ్లారు. బాలిక ఇంటి నుంచి తీసుకువెళ్లే సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో ఉంచిన నిందితులు.. బయట నుంచి తలుపులు వేశారు. బాధితుల బంధువుల ఫిర్యాదుతో.. కిడ్నాపర్లను 150 కిలోమీటర్లు వెంటాడిన పోలీసు బృందాలు.. వారిని తెల్లవారు జామున మూడు గంటల సమయంలో వారిని పట్టుకున్నారు.

ప్రేమ వ్యవహరమే కారణమా?

బాలిక అపహరణకు మరొకరు సహకరించినట్లు తెలుస్తోంది. నిందితులు కదిరి గోరంట్ల ప్రాంతాలకు చెందినవారిగా తెలుస్తోంది. వారి వద్ద నుంచి స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ అయిన బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిసింది. కిడ్నాప్​నకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:దారుణం: యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు

ABOUT THE AUTHOR

...view details