అనంతపురం జిల్లా గుంతకల్లులో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ పర్యటించారు. అనంతరం ఉరవకొండ మీదుగా గుంతకల్ చేరుకున్న మంత్రి.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు.
మంత్రికి ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తీర్థప్రసాదాలు అందజేసి, కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందించి, శాలువాతో సత్కరించారు.