అనంతపురం కలెక్టరేట్లో ఐసీడీఎస్ అధికారులు, ఎన్జీఓలతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్‌లో అమలవుతున్న పథకాలు లబ్ధిదారులకు అందుతున్న తీరును, ఉన్న సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు మంచు ముక్క చేతులు మారినట్టుగా లబ్ధిదారులకు అందేలోపు కరిగి పోతున్నాయన్నారు. వీటిలో మార్పులు వచ్చేలా అధికారులు పని చేయాలన్నారు. అధికారులు నిత్యం కేంద్రాలను తనిఖీ చేస్తూ లబ్ధిదారులకు ఏ మేరకు పథకాలు అందుతున్నాయో పరిశీలించాలన్నారు. కాంట్రాక్టర్లు సరుకులు సక్రమంగా సరఫరా చేయకపోతే చర్యలు తప్పవన్నారు.
'ఐసీడీఎస్‌లో అక్రమాలు వాస్తవమే... చర్యలు చేపడతాం' - అనంతపురం కలెక్టరేట్లో మంత్రి తానేటి వనిత సమావేశం
ఐసీడీఎస్‌లో అక్రమాలు జరుగుతున్న మాట వాస్తవమేనని.. అవి గత ప్రభుత్వం నుంచే కొనసాగుతున్నాయని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. వాటిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
'ఐసీడీఎస్‌లో అక్రమాలు జరుగుతున్న మాట వాస్తవమే'