ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిన్నారి మృతిపై శవ రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి ఉషా శ్రీచరణ్ - మంత్రి ఉషా శ్రీ చరణ్ వార్తలు

Usha Sri Charan: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిన్నారి మృతిపై.. స్త్రీ, శిశు శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్ స్పందించారు. తన పర్యటనకు వచ్చిన ఆదరణను చూడలేకే.. చిన్నారి మృతిపై శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబసభ్యులు తన వల్ల నష్టం జరగలేదని చెప్పినా.. ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని ఆక్షేపించారు. మృతిచెందిన చిన్నారి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.

minister Usha Sri Charan reacts on baby girl death at her procession in ananthapur
స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్

By

Published : Apr 18, 2022, 4:29 PM IST

చిన్నారి మృతిపై శవ రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి ఉషా శ్రీ చరణ్

Usha Sri Charan: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిన్నారి మృతిపై.. ఎట్టకేలకు స్త్రీ, శిశు శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్ స్పందించారు. చిన్నారి మృతిపై.. తెదేపా నేలు శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన పర్యటనకు వచ్చిన ఆదరణను చూడలేకే.. తమపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబసభ్యులు తన వల్ల నష్టం జరగలేదని చెప్పినా.. ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని ఆక్షేపించారు. బాధిత కుటుంబ సభ్యులు కూడా తమపై ఎలాంటి ఆరోపణలూ చేయలేదన్నారు. అయినా బాలిక కుటుంబానికి అన్ని విధాల న్యాయం చేకూరేలా చర్యలు చేపడతామని మంత్రి హామి ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details