ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాల సదన్ భవన్ ను సందర్శించిన మంత్రి తానేటి వనిత - అనంతపురం లో మంత్రి తానేటి వనిత న్యూస్

రాష్ట్రంలో అనాథలు, పౌష్టికాహార లోపంతో బాధపడే వారు ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తానేటి వనిత అన్నారు. అనంతపురంలోని బాల సదన్ భవన్ ను ఆమె సందర్శించారు.

పిల్లలతో కలిసి అల్పాహరం తింటున్న మంత్రి తానేటి వనిత

By

Published : Nov 9, 2019, 2:22 PM IST

అనంతపురం బాల సదన్ భవన్ ను సందర్శించిన మంత్రి తానేటి వనిత

అనంతపురం జిల్లాలో తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటోందని.. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో కలసి బాల సదనాన్ని పరిశీలించారు. అక్కడి పిల్లలతో ఆమె కాసేపు ముచ్చటించి... వాళ్లతో కలసి అల్పహారం తీసుకున్నారు. మిగిలిన జిల్లాల కంటే ఇక్కడ సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని ప్రశంసించారు. ఐరన్ లోపం లేకుండా ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథలుగా మారకూడదని.. అందరిలాా జీవనం సాగించేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details