ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చెప్పినా వినకుండా...ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ఎస్ఈసీ రమేశ్ కుమార్ రాజకీయ పార్టీల చేతిలో కీలుబొమ్మగా మారారని మండిపడ్డారు. ఆయన పదవీ కాలం పూర్తవుతున్నందున చంద్రబాబు వద్ద స్వామిభక్తి చూపటానికే స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతున్నారని ఆరోపించారు.
తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో వైకాపా మూడు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తుందని మంత్రి సురేశ్ ధీమా వ్యక్తం చేశారు.