జేసీ దివాకర్‌రెడ్డి మద్యం మత్తులో మాట్లాడతారని రహదారులు, భవనాల శాఖ మంత్రి ఎం.శంకర నారాయణ ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తెదేపా అసహనాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఎంత మోసకారో రాష్ట్ర ప్రజలకు తెలుసునని మంత్రి వ్యాఖ్యానించారు. దివాకర్‌రెడ్డి సీఎం గురించి మాట్లాడడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు, మైనింగ్ విషయంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి విమర్శించారు.
'జేసీ దివాకర్‌రెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు' - జేసీ దివాకర్ రెడ్డిపై వైకాపా నేతల వ్యాఖ్యలు
జేసీ దివాకర్‌రెడ్డి బస్సులు, మైనింగ్ విషయంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి ఎం.శంకర నారాయణ ఆరోపించారు. దివాకర్‌రెడ్డి సీఎం గురించి మాట్లాడడం దారుణమని దుయ్యబట్టారు.
!['జేసీ దివాకర్‌రెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు' minister shanker narayana comments on jc diwaker reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10743413-695-10743413-1614072844366.jpg)
minister shanker narayana comments on jc diwaker reddy
జేసీ దివాకర్ రెడ్డిపై మంత్రి శంకర నారాయణ
Last Updated : Feb 23, 2021, 4:33 PM IST