శ్రీరామ నవమిని పురస్కరించుకుని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ అనంతపురం జిల్లా పెనుకొండలో 500 ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీరామ భద్రాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని ఆ శ్రీరామచంద్రుడిని వేడుకున్నట్లు తెలిపారు. ఆలయ ఆవరణలో సీతారాముల కల్యాణోత్సవం, హనుమంత వాహన ఉత్సవం నిర్వహించనున్నారు.
శ్రీరామ భద్రాలయంలో మంత్రి శంకర్ నారాయణ ప్రత్యేక పూజలు - అనంతపురం జిల్లాలో శ్రీరామ నవమి వేడుకలు
శ్రీరామనవమిని పురస్కరించుకుని మంత్రి శంకర్ నారాయణ పెనుకొండలోని శ్రీరామ భద్రాలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీరామ భద్రాలయంలో మంత్రి శంకర్ నారాయణ ప్రత్యేక పూజలు