అనంతపురం జిల్లా పెనుకొండ ఎంపీడీవో కార్యాలయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయన గురువారం పరిశీలించారు. ఆదరణ పథకంలో గత ప్రభుత్వం పంపిణీ చేసిన పనిముట్లు పరిశీలించారు. పనిముట్ల నాణ్యత, కొనుగోలుకు వెచ్చించిన ధరలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆదరణ పనిముట్ల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. తక్కువ రేట్లు కలిగిన పనిముట్లను... అధిక ధరలకు కొన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం విత్తన సేకరణలో అలసత్వం ప్రదర్శించిందన్న మంత్రి... తెలంగాణ నుంచి విత్తన సేకరణకు చర్చలు జరుపుతున్నామని చెప్పారు.
ఆదరణ పనిముట్ల కొనుగోలులో అవినీతి: మంత్రి - మంత్రి శంకరనారాయన
సకాలంలో రైతులందరికీ విత్తనాలు సరఫరా చేస్తామని మంత్రి శంకరనారాయన ఉద్ఘాటించారు. బ్లాక్ మార్కెట్కు సబ్సిడీ విత్తనాలు సరఫరా చేస్తే... వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మంత్రి శంకరనారాయన