అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణములోని స్థాని సీవీవీ నగర్లో 3 కోట్ల వ్యయంతో.. కురబ కుల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు నూతన కల్యాణ మండపాన్ని నిర్మించున్నారు. కల్యాణ మండప నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ భూమి పూజ చేశారు. భక్త కనకదాసు జయంతి సందర్బంగా పట్టణంలో కురుబ యువత బైక్ ర్యాలీ, గోరబయ్యాల నృత్య ప్రదర్శన నిర్వహించారు. రాజకీయంగా కురబలు రాజకీయంగా ఎదగాలనీ.. అందుకోసమే ఉరవకొండ మండలం లత్తవరం గ్రామానికి చెందిన గోవిందుకు రాష్ట్ర కురబ కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు.
శ్రీభక్త కనకదాసు నూతన కల్యాణ మండపానికి భూమి పూజ - కల్యాణ మండపానికి మంత్రి శంకర్ నారాయణ శంకుస్థాపన
అనంతపురం జిల్లా ఉరవకొండలో శ్రీభక్త కనకదాసు నూతన కల్యాణ మండపానికి.. మంత్రి మాలాగుండ్ల శంకర్ నారాయణ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు.
శ్రీభక్త కనకదాసు నూతన కల్యాణ మండపానికి భూమి పూజ