జీడిపల్లి రిజర్వాయర్ నుంచి రాప్తాడు నియోజకవర్గ పరిధికి హంద్రీనీవా నది ద్వారా నీటి విడుదల చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలో ఉన్న ప్రతి చెరువుకు నీటిని విడుదల చేయడమే తమ లక్ష్యం అని మంత్రి శంకరనారాయణ తెలిపారు. అనంతరం రిజర్వాయర్ నుండి గేట్లను ఎత్తి హంద్రీనీవా ఫేస్-2 రాప్తాడు నియోజకవర్గ పరిధికి ఆయన నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
జీడిపల్లి నుంచి నీటి విడుదల - ananthapur
జీడిపల్లి రిజర్వాయర్ నుంచి రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని హంద్రీనీవాకు నీటి విడుదల కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు.
జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి శంకరనారాయణ