వైకాపా 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. అనంతపురం జిల్లాలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మంత్రి శంకర్ నారాయణ సహా పలువురు వైకాపా నేతలు కలిసి పార్టీ కార్యాలయంలో.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాజన్న బాటలోనే.. జగనన్న నడుస్తున్నారని మంత్రి కొనియాడారు.
రాజన్న బాటలోనే జగనన్న నడుస్తున్నారు: మంత్రి శంకర్ నారాయణ - మంత్రి శంకర్ నారాయణ తాజా వార్తలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను.. సీఎం జగన్ అనుసరిస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. వైకాపా 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. అనంతపురం జిల్లాలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సంబరాలు జరుపుకున్నారు.
రాజన్న బాటలోనే జగనన్న నడుస్తున్నారు: మంత్రి శంకర్ నారాయణ