రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామ సచివాలయం, వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయని.. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని వానవోలు గ్రామ పంచాయతీలో నిర్వహించిన రచ్చబండ పల్లెబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. క్వింటాలు మొక్కజొన్న రూ.1850కి కొనుగోలు చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి చెప్పారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు: శంకర్ నారాయణ - Rachabanda Latest news
రాష్ట్రంలో గ్రామ సచివాలయం, వాలంటరీ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. మంత్రి శంకర్నారాయణ పేర్కొన్నారు. వానవోలు గ్రామ పంచాయతీలో నిర్వహించిన రచ్చబండ పల్లెబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
శంకర్ నారాయణ