రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేయాలని మంత్రి శంకరనారాయణ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ పల్లెబాట కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఆయా శాఖల మండల అధికారులు ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామస్థుల సమస్యలపై చర్చించిన మంత్రి.... వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో శివశంకరప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరాలి: మంత్రి శంకరనారాయణ - సంక్షేమ పథకాలపై మంత్రి శంకర్ నారాయణ
అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయాలని రహదారులు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా గుట్టూరు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అర్హులందరికి సంక్షేమ పథకాలు చేరాలి