దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బీసీల కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన చరిత్ర సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రి శంకరనారాయణ అన్నారు. కార్పొరేషన్ల ఏర్పాటు సందర్భంగా పెనుకొండలో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్దపీట వేసిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. గత ప్రభుత్వంలో బీసీలను పట్టించుకోలేదని ఆరోపించారు. నాటి తెదేపా ప్రభుత్వం.. బీసీలపై కపట ప్రేమ చూపిందని దుయ్యబట్టారు.
వైకాపా పాలనలో బీసీలకు పెద్దపీట: మంత్రి శంకరనారాయణ - మంత్రి శంకరనారాయణ తాజా వార్తలు
వైకాపా ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని మంత్రి శంకరనారాయణ అన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని తెలిపారు.
minister shankar narayana