అనంతపురం జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో కరోనా కట్టడిపై అధికారులు, వైద్యులు, పోలీసులతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్-19 కట్టడి చేయడంలో దేశంలోనే రాష్ట్రం ముందు స్థానంలో ఉందన్నారు.
కరోనా వ్యాధి విషయంలో చికిత్స కన్నా నివారణ ముఖ్యమన్నారు. సామాజిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రతతో వైరస్ను తమ దరి చేరకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. వాలంటీర్లు, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారని ప్రశంసించారు.