ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"హంద్రనీవా కాలువ పరిధిలో చెరువులన్నీ నింపుతాం" - జలహారతిలో మంత్రి శంకర్ నారాయణ

కరవు సీమ అనంతలో తాగు, సాగు నీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని రాష్ట్ర మంత్రి శంకర నారాయణ అన్నారు. కృష్ణా నీటితో హంద్రీనీవా కాలువలోని చెరువులను నింపుతామని భరోసా ఇచ్చారు.

శంకర నారాయణ

By

Published : Oct 12, 2019, 7:05 AM IST

మీడియాతో మంత్రి శంకరనారాయణ

అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ సమీపంలో ఉన్న అన్ని చెరువులను కృష్ణా జలాలతో నింపుతామని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎం.శంకరనారాయణ అన్నారు. శుక్రవారం ఉదయం పెనుకొండ మండలం మునిమడుగు చెరువుకు జలహారతి కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబర్11న గొల్లపల్లి జలాశయం నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా చిన్నపరెడ్డిపల్లి, మునిమడుగు చెరువులకు నీళ్లు విడుదల చేశారు. ఈ నెల 6వ తేదీనే చెరువు పూర్తిగా నిండింది. అప్పటి నుంచి వర్షాలు కురుస్తున్నందున శుక్రవారం మంత్రి చేతులు మీదుగా జలహారతి నిర్వహించారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ డీఈ గోపి, ఏఈఈ మధుసూదన్ రెడ్డి, పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details