ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షాలకు నష్టపోయిన అరటి రైతులకు మంత్రి శంకరనారాయణ భరోసా - babnana farmers lost crop due to wind and rains

అనంతపురం జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన అరటి రైతులను మంత్రి శంకరనారాయణ పరామర్శించారు. ప్రభుత్వం తరఫున సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

banana plantations destroyed due to rains
వర్షాలకు నష్టపోయిన అరటి రైతులకు మంత్రి శంకరనారాయణ భరోసా

By

Published : Apr 21, 2021, 8:11 PM IST

అనంతపురం జిల్లా రొద్దం మండలం కేంద్రంలో బూచర్ల, నాగిరెడ్డిపల్లె గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులు, వర్షాలకు పడిపోయిన అరటి తోటను మంత్రి శంకరనారాయణ పరిశీలించారు. అంజప్ప, నాగిరెడ్డి అనే రైతులతో పాటు పలువురికి చెందిన.. సుమారు 30 ఎకరాల్లో అరటి తోట నేలవాలింది. దీనివల్ల దాదాపు రూ. 30 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతులు పేర్కొన్నారు.

విషయం తెలుసుకున్న రాష్ట్ర రహదారులు భవనాలు శాఖ మంత్రి అరటి తోటను పరిశీలించారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details