అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామంలో గ్రామ సచివాలయ నూతనభవనాన్ని మంత్రి శంకరనారాయణ, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభించారు. ప్రజల వద్దకే పాలన కోసం వాలంటీర్లు ద్వారా ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించడం కోసం వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం సచివాలయ వ్యవస్థ సమష్టిగా కృషి చేస్తోందన్నారు. అనంతరం వారు మొక్కలు నాటారు.
సచివాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి శంకరనారాయణ - Secretariat building at Rekulakunta
అనంతపురం జిల్లా రేకులకుంటలో గ్రామ సచివాలయ నూతన భవనాన్ని మంత్రి శంకరనారాయణ, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభించారు.
![సచివాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి శంకరనారాయణ Minister Sankaranarayana inaugurated the Secretariat building at Rekulakunta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8435592-557-8435592-1597515961041.jpg)
రేకులకుంటలో సచివాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి శంకరనారాయణ