ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంపై తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి శంకర నారాయణ విమర్శించారు. అనంతపురం ఆర్అండ్బీ వసతి గృహంలో మాట్లాడిన ఆయన... ఐదేళ్లు అధికారంలో ఉన్న తెదేపా నేతలు ఎంత అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారో ప్రజలకు తెలుసన్నారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటోన్న నిర్ణయాలను చూసి ఓర్వలేకే ఇలాంటి ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక విధానంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. తెదేపా, జనసేన పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు.
'ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి చూసి ఓర్వలేకే తెదేపా నిరసనలు' - మంత్రి శంకరనారాయణ తాజా వార్తలు
తమ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి చూసి ఓర్వలేకే తెదేపా నేతలు నిరసనలు చేస్తున్నారని మంత్రి శంకర నారాయణ అన్నారు. ఇసుక విధానంపై వారి ఆందోళనలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
అనంతపురంలో మంత్రి శంకరనారాయణ మీడియా సమావేశం