ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి: మంత్రి శంకరనారాయణ - మంత్రి శంకరనారాయణ తాజా వార్తలు

అనంతపురం జిల్లా పందిపర్తిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి శంకరనారాయణ పాల్గొన్నారు. రాష్ట్రంలోని అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించాలని అధికారులకు సూచించారు.

sankara narayana, minister
శంకరనారాయణ, మంత్రి

By

Published : Nov 13, 2020, 6:13 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ అన్నారు. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని పందిపర్తిలో నిర్వహించిన రచ్చబండ- పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాదయాత్ర చేపట్టారు. అనంతరం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. గ్రామంలోని సమస్యలపై మంత్రి ఆరా తీశారు. ప్రజలు తమ సమస్యలపై మంత్రికి వినతి పత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details