సామాజిక దూరం పాటిస్తే కరోనా వైరస్ నియంత్రించడం సులభమవుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో మంత్రి పర్యటించారు. పట్టణంలోని పలు వీధుల్లో హైడ్రోక్లోరైడ్ ద్రావకాన్ని పిచికారి చేశారు. అనంతరం రేషన్ దుకాణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యాన్ని పరిశీలించారు. వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రజలకు అండగా ఉంటాం: మంత్రి శంకర్ నారాయణ - కరోనాపై మంత్రి శంకర నారాయణ
కష్ట సమయాల్లో ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శంకర్ నారాయణ హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా పెనుకొండలో కరోనా వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
కరోనాపై మంత్రి శంకర నారాయణ సూచనలు