Peddireddy Ramachandra Reddy : జగన్ సహా ప్రతి ఒక్కరి నియోజకవర్గంలోనూ అసమ్మతి ఉందని.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఉన్న వ్యతిరేకతను ఎలా అధిగమించాలనే అంశంపైనే చర్చించాలి తప్ప.. అనవసరంగా రాద్ధాంతం చేయవద్దని సూచించారు. అనంతపురం జిల్లాలో పార్టీ పరిస్థితిపై సమీక్ష సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలపై అసమ్మతి వర్గం నాయకులు చేసిన వ్యాఖ్యలపై పెద్దిరెడ్డి ఈ మేరకు స్పందించారు.
ప్రతి ఒక్క నియోజకవర్గంలో అసమ్మతి ఉంది : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - అసమ్మతి సహజమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Peddireddy Ramachandra Reddy : ప్రతి ఒక్క నాయకుని పైన అసమ్మతి సహజమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురంలో నిర్వహించిన పార్టీ సమీక్ష సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
"ఏ నియోజకవర్గంలోనైనా అసమ్మతి ఉంటుంది. నాయకుల మీద అసమ్మతి లేని నియోజకవర్గం ఎక్కడ ఉండదు. తుదకు నాకు కూడా ఉంది. మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రికి కూడా అసమ్మతి ఉంటుంది. అన్నింటిని సామరస్యంగా పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలి."- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి
ఇవీ చదవండి: