ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాయదుర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తా' - #apelection2019

వెనుకబడిన ప్రాంతమైన రాయదుర్గం.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. ప్రజలు ఆశీర్వదిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా: మంత్రి కాలవ

మంత్రి కాలవ శ్రీనివాసులు(ఫైల్)

By

Published : Mar 25, 2019, 4:05 PM IST

మంత్రి కాలువ నామినేషన్
అనంతపురం జిల్లా రాయదుర్గం తెదేపా అభ్యర్థిగా మంత్రి కాలవ శ్రీనివాసులు.. తన కుటుంబసభ్యులతో కలసి నామినేషన్ వేశారు. మంత్రిసతీమణి విజయలక్ష్మి.. శుక్రవారం ఒక సెట్ దాఖలు చేయగా.. పూర్తి స్థాయి నామ పత్రాలను మంత్రి ఇవాళ సమర్పించారు. రాయదుర్గం నియోజకవర్గఅభివృద్ధి కోసం 4 వేల 500 కోట్ల రూపాయల విలువైనపనులు ప్రారంభించామని గుర్తు చేశారు. వాటిని పూర్తి చేయటానికి తనకు మళ్లీ అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఓటర్లకు చెప్పారు.వెనుకబడిన ప్రాంతమైన రాయదుర్గాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నామని.. ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తే.. అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. నామినేషన్ వేసిన అనంతరం కార్యకర్తలతో కలసి రాయదుర్గం పట్టణంలో భారీ ర్యాలీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details