ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు పవన్​కు కన్పించడం లేదా?' - జోగి రమేష్​

MINISTER JOGI RAMESH COMMENTS ON PAWAN : 31 లక్షల మంది పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్​ అన్నారు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే.. పవన్‌కల్యాణ్‌కు కనిపించలేదా అంటూ మండిపడ్డారు.

MINISTER JOGI RAMESH COMMENTS ON PAWAN
MINISTER JOGI RAMESH COMMENTS ON PAWAN

By

Published : Nov 15, 2022, 5:52 PM IST

YSRCP LEADERS FIRES ON PAWAN : జగనన్న కాలనీలపై పవన్ కల్యాణ్ కళ్లులేని కబోది తరహాలో మాట్లాడుతున్నారని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి.. రాప్తాడు నియోజకవర్గంలోని ఆలమూరు జగనన్న కాలనీ లేఔట్​ను పరిశీలించారు. రాష్ట్రంలో 31 లక్షల మంది పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్ మోహన్​రెడ్డికే దక్కుతుందన్నారు.

జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే.. పవన్ కల్యాణ్​కు కనిపించలేదా అన్నారు. ఇళ్ల నిర్మాణాలు జరిగే కాలనీలకు తమతో కలిసి రమ్మని చెప్పినా కానీ.. చంద్రబాబు, పవన్ రావటం లేదని విమర్శించారు. గృహ నిర్మాణాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని మంత్రి చెప్పారు. పేదల కోసం భూములు కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామన్నారు. తమ నేత సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకున్నారు కాబట్టే.. పేదల కోసం పని చేస్తున్నారన్నారు. గృహ నిర్మాణాల పురోగతి, జగనన్న కాలనీలపై జిల్లా అధికారులతో మంత్రి రమేష్ సమీక్ష నిర్వహించారు.

జగనన్న కాలనీలపై.. పవన్​ కళ్లులేని కబోదిలా వ్యవహరిస్తున్నారు

చంద్రబాబు నాయుడి స్క్రిప్ట్​కు.. పవన్​కల్యాణ్​ యాక్షన్​: జనసేన అధ్యక్షుడు పవన్​కల్యాణ్​పై మాజీ డిప్యూటీ సీఎం, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తీవ్ర విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్​కు పవన్ కల్యాణ్ యాక్షన్ చేస్తున్నాడని విమర్శించారు. ఏ స్థాయిలో ఆయన జగనన్న కాలనీలు, కొండలు పరిశీలిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా పవన్ వెకిలి చేష్టలు మానుకోవాలని హితవు పలికారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details