ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేక్ కట్ చేసినట్టు విడగొట్టారు! - classrooms

అనంతపురం జిల్లా అమిద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు, వసతుల కల్పన పనులకు మంత్రి గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఆయన వెంట శాసనమండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారు.

అమిద్యాలలో పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

By

Published : Feb 27, 2019, 11:58 PM IST

మంత్రి గంటాశ్రీనివాసరావు పర్యటన
కేకును కట్ చేసినట్టు దిల్లీ పెద్దలు రాష్ట్రాన్ని విడగొట్టారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అనంతపురంజిల్లా అమిద్యాలలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులు, వసతుల కల్పన పనులకు శంకుస్థాపన చేశారు.రాజధాని లేని రాష్ట్రాన్ని మనకు అప్పగించారని ఆరోపించారు. కనీసం సీఎం కుర్చోవటానికి కూడా లేకుండా బస్సులోనే పరిపాలన సాగించేలా అన్యాయం చేశారని విమర్శించారు. సీఎం చంద్రబాబు కృషితో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకుపోతోందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details