ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి, కలెక్టర్ - ananthapuram latest news

హిందూపురం నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు, నాయకులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకర్​నారాయణ, కలెక్టర్ గంధం చంద్రుడు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు.

హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి, కలెక్టర్
హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి, కలెక్టర్

By

Published : Apr 26, 2021, 9:35 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నా తరుణంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ హిందూపురం లో పర్యటించారు. తూముకుంట పారిశ్రామికవాడలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్​ను పరిశీలించి ప్లాంట్ నిర్వాహకులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన కొవిడ్ వార్డులను పరిశీలించి రోగులకు అందిస్తున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో మంత్రి, కలెక్టర్, ఎంపీ గోరంట్ల మాధవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ.. కర్ణాటకలో పూర్తిస్థాయి కర్ఫ్యూ విధిస్తున్న నేపథ్యంలో వలస కార్మికులు రాష్ట్రానికి తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అలాంటి వారిని గుర్తించి కొవిడ్ పరీక్షల నిర్వహించి హోమ్ క్వారంటైన్ అవసరమైన వారిని ఐసొల్యూషన్, ఆస్పత్రులకు తరలిస్తామని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. హిందూపురంలో కరోనా బారిన పడిన వారికోసం ప్రభుత్వ ఆసుపత్రితో పాటు మరో 6 ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీపీఎల్‌ కుటుంబాలకు ఉచిత బియ్యం

చిన్నారుల సరికొత్త నేస్తం 'ఈటీవీ బాలభారత్'​- రేపే ప్రారంభం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details