ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్‌ను ఎదుర్కోవడంలో ' ఏపీ ' దేశంలోనే ముందంజ' - CORONA VIRUS CASES IN ANANTAPUR DISTRICT

కొవిడ్ నియంత్రణా చర్యలపై అనంతపురంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. అధికారులతో సమీక్షించారు. గతేడాది కరోనా పరిస్థితులపై తీసుకున్న చర్యలు.. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. దేశంలో కొవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు.

కొవిడ్ నియంత్రణా చర్యలపై మంత్రి బుగ్గన సమీక్ష
కొవిడ్ నియంత్రణా చర్యలపై మంత్రి బుగ్గన సమీక్ష

By

Published : Apr 22, 2021, 5:42 PM IST

కొవిడ్ నియంత్రణా చర్యలపై మంత్రి బుగ్గన సమీక్ష

అనంతపురం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో కరోనా నివారణ చర్యలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి జిల్లా అధికారులతో సమీక్షించారు. కొవిడ్‌ చికిత్సకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే ప్రైవేటు ఆసుపత్రులు అమలు చేయాలని ఆదేశించారు. వీటిని పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

అవసరమైన ప్రాంతాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను అన్ని వసతులతో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న మందుల కొరతను అధిగమిస్తామన్నారు. అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల్లోని సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని.. వాటిని వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కొవిడ్‌ నియంత్రణలో ఏపీ దేశంలోనే ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా నివారణకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రుల బృందం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఖర్చుకు వెనకాడకుండా ప్రజలకు అవసరమైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు.

ఇవీ చదవండి

రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో.. అనధికార కర్ఫ్యూ, లాక్​డౌన్!

ABOUT THE AUTHOR

...view details