ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం అప్పుడే జరిగింది : బొత్స - విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అనంతపురంలో స్పందించిన మంత్రి బొత్స

అనంతపురం వైకాపా కార్యకర్తలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికలపై వారితో చర్చించిన అనంతరం.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఆయన స్పందించారు. కేంద్రం నిర్ణయం బాధాకరమని.. నష్టాల నుంచి పరిశ్రమను గట్టెక్కించేందుకు.. ప్రధానికి సీఎం జగన్ రెండు మార్గాలు సూచించారని చెప్పారు.

minister botsa press meet in anantapuram on visakha steel privatization
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై అనంతపురంలో మంత్రి బొత్స మీడియా సమావేశం

By

Published : Feb 7, 2021, 6:53 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై అనంతపురంలో మంత్రి బొత్స మీడియా సమావేశం

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దురదృష్టకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అనంతపురంలో వైకాపా కార్యకర్తలతో ఎన్నికల గురించి సమావేశమైన అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయడం బాధాకరమన్నారు.

ఈ విషయంపై ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని బొత్స తెలిపారు. పరిశ్రమను నష్టాల నుంచి గట్టెక్కించటానికి ప్రధానికి సీఎం జగన్ రెండు మార్గాలు సూచించారని వెల్లడించారు. 2017లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే.. ఉక్కు కర్మాగారంలో పెట్టుబడులు ఉపసంహరణ నిర్ణయం జరిగినట్లు పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details