రాజధాని అమరావతిలో కొనసాగుతుందా? లేదా? అనేది తానేమీ చెప్పలేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన బొత్స ఈ అంశంపై స్పందించారు. రాజధాని విషయంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని.. నిర్ణయించాల్సింది కమిటీనే అని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో పర్యటించి, ఏ జిల్లాలో ఏం ఉండాలన్నదానిపై నివేదికను కమిటీ తయారు చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం వద్దనేవారంతా.. తమ పిల్లలను ఎక్కడ చదవిస్తున్నారని ప్రశ్నించారు. తెదేపా ప్రభత్వంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగిందని ఆరోపించారు.
రాజధాని అంశాన్ని కమిటీ నిర్ణయిస్తుంది: బొత్స - రాజధాని అంశంపై కమిటీ నివేదిక న్యూస్
రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. అమరావతిలోనే కొనసాగుతుందా? మరో ప్రాంతానికి మారుతుందా? అనే విషయం తానేమీ చెప్పలేనని స్పష్టం చేశారు.
minister bosta satyanarayana on capital amaravathi