అనంతపురం జిల్లా కదిరిలోని కుటాగుళ్ల వద్ద 42వ నెంబరు జాతీయ రహదారిపై మినీ బస్సు.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా...మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
లారీని తప్పించబోయి..ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న మినీ బస్సు, ఒకరు మృతి - kadhiri road accident
లారీని తప్పించబోయి ఓ మినీ బస్సు.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా...మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

కదిరి మండలం నాగూరువాళ్లపల్లికి చెందిన చిన్నవెంగముని భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై కదిరి నుంచి ఇంటికి వెళ్తున్నారు. అనంతపురం వైపు వెళ్తున్న మినీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ గాయపడగా... ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంగముని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ఇదీ చదవండీ...భార్య నగ్న వీడియోలతో వ్యాపారం.. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు