అనంతపురం జిల్లా హిందూపురంలో తెలంగాణలోని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అధికార, విపక్ష పార్టీలను తీవ్రస్థాయిలో విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం వచ్చిన ఆయన మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డులోని ఎంఐఎం పార్టీ అభ్యర్థులను గెలిపించి తమ సత్తా ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు.
మైనార్టీలను కాపాడేది ఎంఐఎం పార్టీయే అని స్పష్టం చేశారు. భాజపాను అడ్డుకోకపోతే భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుందని ప్రజలను హెచ్చరించారు. ఎన్నార్సీ, ఎన్పీఆర్ లపై ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.