అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎస్కేడీ ఇంజినీరింగ్ కళాశాలలోని క్వారంటైన్‌లో ఉంటున్న కరోనా అనుమానితులు.. పోలీసులపై దాడికి దిగారు. తమను ఇళ్లకు పంపేవరకు భోజనం చేయబోమంటూ నిరసన తెలిపారు. గస్తీ కాస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు పంపిచడం వీలు కాదని పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఐనప్పటికీ వినకుండా పోలీసులపై మట్టి గడ్డలతో, రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటనలో సీఐ రాజశేఖరరెడ్డితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. చివరికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించి వారిని కేంద్రాలకే పరిమితం చేశారు.
క్వారంటైన్ కేంద్రంలో పోలీసులపై రాళ్ల దాడి
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎస్కేడీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో ఉన్న కరోనా అనుమానితులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో సీఐ రాజశేఖరరెడ్డితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.
పోలీసులపై రాళ్లతో దాడి చేసిన వలస కార్మికులు