లాక్ డౌన్ ప్రభావంతో ఉపాధి లేక తినడానికి ఆహారం దొరక్క.. ఉపాధి కోసం వలస వెళ్లిన ప్రజలు బెంగళూరు నుంచి అనంతపురం వరకు 220 కిలోమీటర్ల మేరకు సైకిల్‌పై ప్రయాణిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు యువకులు కొంతకాలం క్రితం ఉపాధి కోసం కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్ముతూ బెంగళూరుకు చేరారు. అక్కడ ఓ చిన్న గదిని అద్దెకు తీసుకొని రోజు సైకిల్‌పై కుల్ఫీ ఐస్ క్రీమ్ విక్రయించి జీవనం సాగించేవారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి... ఆకలితో ఉండలేక.. అనంతపురంలో నివసిస్తున్న తమ కుటుంబ సభ్యుల వద్దకు సైకిల్‌పై ప్రయాణం బయలుదేరామని వీరు తెలిపారు. ఈ రోజకు పెనుగొండ చేరుకున్నారు.
సైకిల్‌పై 220 కిలోమీటర్ల ప్రయాణం... అనంతపురమే గమ్యం! - travelling on cycle from Bangalore to anantapur dst
లాక్డౌన్ కారణంగా వలస కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వారిని గుర్తించి తగిన వసతులు కల్పిస్తున్నప్పటికీ... అధికారుల కంటికి కనపడని వారందెరో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 12 మంది యువకులు బెంగుళూరులో ఉంటూ... కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. లాక్డౌన్ కారణంగా ఆదాయం లేక బెంగుళూరు నుంచి అనంతపురం జిల్లాకు సైకిల్‌పై బయలుదేరారు. ఇప్పటికే 220 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు.

సైకిల్‌పై 220కిలోమీటర్ల ప్రయాణం... అనంతపురమే గమ్యం!